నేటి సాక్షి. కొమురం భీము ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన బీసీ రైతు సంఘం అధ్యక్షులు వైరాగడే మారుతి పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఎకరా పట్టాకు ఎటువంటి షరతులు లేకుండా 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని కౌలు రైతులకు ఆధార్ కార్డ్ ప్రతిపదికన పత్తి కొనుగోలు చేయాలని బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాగడే మారుతి పటేల్ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కాపాస్ కిసాన్ యాప్ వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎకరాకి కేవలం ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే మిగతా పత్తిని ప్రైవేట్ దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారని కౌలు రైతులు పట్టా పాస్ పుస్తకాలు లేక కాపాస్ కిసాన్ యాప్ లో కౌలు రైతుల ఎంపిక లేక ప్రైవేట్ దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కావున కలెక్టర్ గారు చొరవ తీసుకొని పత్తి రైతుల సమస్యలను పరిష్కారమయ్యే దిశగా రైతుల పక్షాన ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు.





