Wednesday, March 18, 2026

*ఎస్సీ ఎస్టీ సమస్యలపై ప్రభుత్వ అధికారులు తీరుపై మండిపడ్డ ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*కె. వి పల్లి మండలం లో ఎస్సీ ,ఎస్టీ సమస్యలపై ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, MDPS రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య, గిరిజన జిల్లా నాయకుడు కిల్లా విజయకుమార్ లు మండిపడ్డారు. వీరు నేడు కె. వి పల్లి తహసిల్దార్ కార్యాలయం నందు తహసిల్దార్ నరేంద్రను కలిసి పలు అంశాలను ఆయనతో చర్చించడం జరిగింది అందులో ప్రధానంగా* మారెళ్ళ గ్రామం మంచాలమంద లో యానాది కుటుంబానికి చెందిన భూములను అగ్రకులస్తులు కబ్జా చేశారని కబ్జా గురైన భూములను సర్వే చేసి యానాది కుటుంబాలకు అప్పజెప్పాలని కోరారు. అదేవిధంగా గర్నిమిట్ట గ్రామం బైనేని మాదిగ పల్లి వాసులకు సర్వే నంబర్ 1140 లో 50 సెంట్ల ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక కేటాయించడంతో దానిని అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి వ్యక్తి కబ్జా చేసి కూసాలు నాటారని అదేవిధంగా ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కూసాలు నాటారని పలుమార్లు గ్రామస్తులు మీ దృష్టికి తెచ్చిన మరియు జిల్లాస్థాయి అధికారులు సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన మీరు సమస్యను పరిష్కరించుకోవడానికి ఆంతర్యం ఏమిటని తహసిల్దార్ పై మండి పడటంతో తహసిల్దార్ చేసేదేం లేక హుటా హుటిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ , గ్రామ వీఆర్వో సంఘటన స్థలానికి వెళ్లి విచారించి చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో అనంతరం ఆర్ఐ రమణ రెవెన్యూ బృందంతో స్థలాన్ని పరిశీలించి ఐదు ఎకరాల 30 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జా గురైందని అందులో స్మశాన వాటికకు కేటాయించిన స్థలం కూడా ఉందని చెరువు చుట్టూ నాటిన రాతికూసాలను తొలగిస్తానని హామీ ఇచ్చారని వీరు తెలిపారు. *అదేవిధంగా కె. వి పల్లి ఎంపీడీవో సుధాకర ను పాలకుంట శ్రీనివాసులు ,ముల్లంగి చంద్రయ్య కలిసి పలు అంశాలపై చర్చించారు అందులో ప్రధానంగా మండలంలో* ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో వీధిలైట్లు వెలగడం లేదని, శానిటేషన్ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని పలుమార్లు సమస్యను మీ దృష్టికి తెచ్చిన పరిష్కరించకపోవ డానికి క్షేత్రస్థాయి అధికారుల లోపమా లేక మీలోపమా అని ప్రశ్నించడంతో వెంటనే ఎంపీడీవో గారు స్పందించి మండలంలో ఉండే అన్ని పంచాయతీల సెక్రటరీలను తన కార్యాలయానికి పిలిపించి మండలంలో ఎస్సీ ,ఎస్టీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నేను పలుమార్లు మీకు చెప్పిన చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని సెక్రెటరీలపై తీరుపై మండిపడ్డారు .ఈనెల 24వ తేదీ లోపల మండలంలో ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో నెలకొన్న వాటర్ సమస్యను, శానిటేషన్ వీధిలైట్లు ఏర్పాటు చెయ్యాలని లేనిపక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటానని పంచాయతీ సెక్రటరీ తను హెచ్చరించారని వీరు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన నాయకులు అమృతపురి శ్రీనివాసులు, వగల్లు ఆంజనేయులు, అమృతపురి మల్లికార్జున, సామ్రాజ్ అశోక్ కుమార్, వెంకటరమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News