Wednesday, March 18, 2026

*పారుమంచాల రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ రద్దు చేయాలి :—సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు డిమాండ్…….1.పంచాయతీరాజ్ అధికారులను సస్పెండ్ చేయాలి.. *సీపీఐ .. ఎం. రమేష్ బాబు డిమాండ్*..

నేటి సాక్షి జూపాడుబంగ్లా నవంబర్ 18 :–జూపాడు బంగ్లా మండలం తంగేడంచ గ్రామ అంచె నుండి పారుమంచాల వరకు రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు వేసి అవినీతికి పాల్పడ్డాడని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే కాంట్రాక్టు రద్దు చేయాలని అదే విధంగా కృష్ణ రావు పేట నుండి మిట్ట కాందల వరకు మరియు పారుమంచాల నుండి సిద్దేశ్వరం వరకు రోడ్డు నాసిరకంగా రోడ్లు వేసి ధనార్జనే ద్యేయంగా అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మకై రోడ్లు నాసిరకంగా వేశారని తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం పారమంచాల రోడ్డును సిపిఐ మండల నాయకులు మక్బూల్ బాషా, రాజులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లు నాసిరకంగా వేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు రోడ్లకు కేటాయిస్తే అదే అదునుగా భావించిన కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మకై ముడుపులకు ఆశపడి అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని రోడ్లు నాణ్యతగా వేయడంలో విఫలం చెందారన్నారు. మండల పంచాయతీరాజ్ అధికారి 10సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్న కాంట్రాక్టర్ల విషయంలో ఏమి చర్యలు తీసుకోవడం లేదన్నారు.. రోడ్ల నాణ్యత పై చాలాసార్లు మండల పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రోడ్లు దెబ్బ తినడం వల్ల అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆక్సిడెంట్లతో ప్రాణాలు కోల్పోతున్నారని గర్భిణీ స్త్రీల పరిస్థితి అగమ్య గొచరంగ మారిందన్నారు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంటాక్ట్ రద్దు చేయాలని గతంలో కూడా అనేక ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదన్నారు వీరి వల్ల కోట్ల రూపాయలు వృధా తప్ప ఉపయోగం లేదన్నారు. అధికారులు నిమ్మకు నిరీతినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు మల్లయ్య వెంకటేశు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News