Wednesday, March 18, 2026

*వరుస దొంగతనాలతో రైతులు, ప్రజలు బెంబేలు* *గుడిలో కంచు గంట ఎత్తుకెళ్లిన దొంగలు* *

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* వరుస దొంగతనాలతో వరుస గన్నేరువరం మండలంలో రైతులు ఇటు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో కొరివి మల్లయ్యకు చెందిన రెండు గేదె లను సోమవారం రాత్రి కట్టేసిన దుడ్డేలను తాళ్లు కోసి ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. 60,000 ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఇదే రాత్రి హనుమాన్ దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు గుడిలోని పెద్ద గంట ఎత్తుకెళ్లారు. భక్తులు, స్థానికులు మంగళవారం ఉదయం దేవుడికి మొక్కి గంట కొడదామనే సరికి గంట లేకపోవడంతో ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. దీంతో గంట చోరికి గురైనట్లు తెలిపారు. ఇదే ఆలయంలో రెండు ఏళ్ల క్రితం ఉండి ఎత్తుకెళ్లారు. ఎస్ఐ ఉండే ఇల్లు పక్కనే ఉన్న దేవాలయంలో చోరీ జరగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మూడు ఆవులును దుండగులు ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో వరుస రైతులు ఆందోళన చెందుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News