నేటి సాక్షి పాములపాడు నవంబర్ 18 :– తెలుగు గంగ, కేసి కెనాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు అధికారులు డిమాండ్ చేశారుఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు మాట్లాడుతూ నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, వేంపెంట భానకచర్ల మధ్యలో నున్న నిప్పుల వాగు తవ్వకంలో అదే మాదిరిగా తెలుగు గంగ తవ్వకం లో తేలిన మట్టి రాయిని వెంపెంట దగ్గరలో వెలుగోడు రిజర్వాయర్ కాలువ వెంట డంపు చేస్తే ఆ మట్టిని బిలుకు రాయిని కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్ల కని వెంచర్ల కని యదేచ్చగా వారి ట్రిప్పర్లు హిటాచీలు పెట్టి వేల క్యూబిక్ మీటర్లు తరలిస్తున్న తెలుగు గంగా అధికారులు కానీ కేసీ కెనాన్ అధికారులు కానీ ముడుపులు తీసుకొని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లు అక్రమంగా లక్షల రూపాయల మెటీరియల్ తీసుకుని సొమ్ము చేసుకుంటున్నా తెలుగుగంగ కేసీ కెనాల్ అధికారులకు ముడుపులు ముడుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. వెంటనే పని ప్రదేశంలో ఉన్న టిప్పర్లను హిటాచిని సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ కు కొంత చొప్పున కాంట్రాక్టలు ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్న అధికారులు ఆ ప్రతిపాదనలు గాలికి వదిలేసి సొంతంగా సొమ్ము చేసుకుంటున్నారనీ అన్నారు. వెంటనే ఈ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ కి లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.





