Wednesday, March 25, 2026

*ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించండి :- నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య

నేటి సాక్షి కొత్తపల్లె నవంబర్ 18 :–కొత్తపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహశీల్దార్ కే. అరుణ ఎమ్మెల్యే జయసూర్య పూల బొక్కెతో స్వాగతం పలకడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా హాజరై పలు శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. ముందుగా వైద్యానికి సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా విద్యకు అధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందన్నారు. రోడ్లకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ, అన్నిటిని సమస్యల మీద ఆరా తీశారు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించండి అని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.కొత్తపల్లి మండల వ్యాప్తంగా తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య .*ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ,ప్రజా సమస్యల ప్రజా వేదిక గ్రీవెన్స్ అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తుందని అందులో భాగంగానే ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వారి సమస్యల పరిష్కారానికి తామున్నామంటూ గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.*ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న అర్జీ రూపంలో తమకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్రం అధోగతి పాలయ్యిందన్నారు. ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజలకు జవాబు దారీతనంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News