Wednesday, March 25, 2026

మత్తు పదార్థాల నిర్మూలన కు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్.జిల్లా ఎస్ పి నారాయణ రెడ్డి.

నేటి సాక్షి వికారాబాద్ :మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సమాజానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మత్తుపదార్థాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోరాదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.మంగళవారం అనంత గిరిపల్లి తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రేసిడెన్షియల్ (బాలుర) పాఠశాల మరియు కళాశాల నందు శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన (నషా ముక్త్ భారత్ ) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించరాదని, పిల్లలు పెద్దలు ఈ విషయంలో బాధ్యతగా ఉండాలని, ఆయన పేర్కొన్నారు.మత్తు పదార్థాలు వాడటం వలన గుండె జబ్బులు అన్ని అవయవాలు పాడవటానికి కారణమవుతాయని, ప్రపంచం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చూడాలన్న మత్తుపదార్థాల జోలికి వెళ్లకూడదని ఆయన అన్నారు.ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకున్న, తీసుకున్నట్టు కనిపించిన సమాచారం ఇవ్వాలన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు ,జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని, చదువు వదిలేసి మత్తుకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురికావలసి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, అందువల్ల క్రమశిక్షణతో, ఓపికగా చదువుకోవాలని, మంచి పౌరులుగా ఎదగాలని, చదువుతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు.జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ నిషా యుక్త భారత్కార్యక్రమము పై పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, రాష్ట్రయువత డ్రగ్స్ రహిత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు.విద్యార్థులకు ఎవరైనా ఏమైనా పదార్థాలు ఇచ్చినచో తీసుకోకూడదని, ఈ విషయాన్ని వారి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. దేశ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉందని, యువత చెడు అలవాట్లకు గురి కాకూడదని బానిస కావద్దని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా డ్రగ్స్ కహిత జీవన శైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడ కుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం,కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలుయ చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణా ప్రభుత్వ సంకల్పం లో భాగస్వామిని అవుతానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణ వేణి, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ నరసింహారావు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News