Wednesday, March 18, 2026

ప్రాణం పోయినా కాంగ్రెస్ పార్టీ మారను…- నాలుగు దశాబ్దాల నిబద్ధతకు ప్రతీక జెల్లా రవీందర్- 40 ఏళ్లుగా ఒకే పార్టీలో సేవలు- జీవన్ రెడ్డి ఆరాధకుడిగా, కాంగ్రెస్ సైనికుడిగా పయనం- పివి నరసింహారావు స్పూర్తితో ప్రారంభమైన రాజకీయ ప్రయాణం- జగిత్యాల 47, 48 వార్డులలో అచంచల నాయకత్వం – పార్టీ అధికారంలో ఉన్నా… లేకపోయినా.. మారేది కాదు నా విశ్వాసం.- జగిత్యాల 47, 48 వార్డుల ఇంచార్జ్‌ కాంగ్రెస్ నాయకుడు జెల్లా రవీందర్*

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల : మాజీ ప్రధానమంత్రి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామం వంగర (భీమదేవరపల్లి మండలం, పూర్వం కరీంనగర్ జిల్లా)లో 06-06-1966న జన్మించిన జెల్లా రవీందర్ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, ప్రజాసేవ, రాజకీయ విలువలను అలవర్చుకున్నారు. ఆయన తండ్రి జెల్లా రాజలింగం టైలర్ వృత్తి కారణంగా కుటుంబం 1980లో జగిత్యాలకు వలస వచ్చింది. అప్పటి నుంచి రవీందర్ జీవితం మొత్తం జగిత్యాల పట్టణ ప్రజలతో, ప్రజాసేవతో ముడిపడి పోయింది.- *40 ఏళ్ళకుపైగా అచంచల నమ్మకం ‘కాంగ్రెస్‌ నా తల్లి’*1983లోనే పార్టీ జెండా పట్టుకున్న రవీందర్, అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ పివి నరసింహారావును ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్‌ను ఒక ‘తల్లి’గా భావిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ, తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రోజు నుంచే రవీందర్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.- *జీవన్ రెడ్డి అంటే అభిమానం కాదు. ఆరాధన..*జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన క్షణం నుంచి నేటివరకు రవీందర్ ఆయనకు గట్టి అనుచరుడిగా, అంకితభావంతో కూడిన సైనికుడిగా నిలిచారు. జీవన్ రెడ్డి కండువా కప్పుకోవడం నా జీవితంలో గర్వకారణం. ఆయన నాయకత్వం నాకు దిశానిర్దేశం అంటూ రవీందర్ గర్వంగా చెప్తారు. – *పార్టీ అధికారంలో ఉన్నా… లేకపోయినా… విశ్వాసం తగ్గలే*ఏ పరిస్థితుల్లోనైనా, ఏ రాజకీయ హడావుడి వచ్చినా కాంగ్రెస్ పార్టీపై తన భక్తి, విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని జెల్లా రవీందర్ స్పష్టంచేస్తారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పార్టీని మార్చే ప్రసక్తే లేదు. నా జీవితం, నా సేవలు మొత్తం కాంగ్రెస్ కోసమే. జీవన్ రెడ్డిపైనున్న నా నమ్మకం మారదని ఆయన ధైర్యంగా చెబుతారు. ప్రస్తుతం రవీందర్ జగిత్యాల తారకరామ్ నగర్ 47, 48 వార్డుల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News