Wednesday, March 18, 2026

పత్తి కొనుగోలుపై పెట్టిన నిభందనలు ఎత్తివేయాలి.మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూర్ మండల కేంద్రం లో మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్,పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అనంతరం డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ…ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లేని కొత్త నిబంధనలను తీసుకురావడం ద్వారా రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి వడిగాపులు కాయాల్సి వస్తోంది.గతంలో కెసిఆర్ పాలనలో రైతు తన ఆధార్ కార్డు మీద ఒకసారి స్లాట్ బుక్ చేసుకుని ఎంత పంటనైనా అమ్ముకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఆ వెసులుబాటును తొలగించి పరిమితిని విధించడం, వేరువేరు గ్రామాల్లో పొలం కలిగిన రైతులు ప్రతిసారి స్లాట్ బుక్ చేసుకోవాలనే విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వం వెంటనే ఈ పరిమితిని ఎత్తివేసి, రైతు తన ఆధార్ కార్డు పైన ఒకసారి స్లాట్ బుక్ చేసుకుని తన పూర్తి పంటను అమ్ముకునే వెసులుబాటును తిరిగి కల్పించాలి. రైతులు పండించిన పంటను తమ సొంత జిల్లాలోనే అమ్ముకునే నిబంధన ద్వారా జిల్లా కేంద్రానికి దూరంగా ఉండి పక్క జిల్లాకు దగ్గరగా ఉన్న రైతులు అక్కడ వారి పంటను అమ్ముకోలేక, జిల్లా కేంద్రం వరకు తీసుకురాలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతు తాను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాలి. తేమశాతం ఎక్కువగా ఉందన్న కారణం ద్వారా డబ్బులలో కోత విధించడంతో ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రాకపోవడం బాధాకరం. సీఎం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి ఎలక్షన్ల గురించి చర్చించడం కంటే ముందు రైతుల గురించి ఆలోచించాలని కోరుతున్నాను.కెసిఆర్ పాలనలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు సత్వరమే డబ్బులు చెల్లించి ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దాని ఊసే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రతి రైతు పండించిన చివరి గింజ వరకు కొనే విధంగా చర్యలు తీసుకోవాలని బీ ఆర్ ఎస్ పార్టీ తరపున కోరూతును.ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News