( నేటి సాక్షి):నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారులు, అలాగే స్థానికులు కలిసి పాల్గొన్నారు.పాల్గొన్నవారు అందరూ కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయం, అక్రమ రవాణా వంటి అంశాలు సమాజాన్ని దుష్ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను అరికట్టడం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, “ఎవరైనా మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యినట్లు సమాచారం తెలిసిన సందర్భంలో వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు అందించడం ద్వారా డ్రగ్ రహిత సమాజ నిర్మాణం దిశగా మనమందరం ముందడుగు వేయాలి” అని పిలుపునిచ్చారు.నషా ముక్త భారత్ అభియాన్ కింద ఈ కార్యక్రమం, స్థానిక ప్రజల్లో జాగృతిని పెంపొందించి, డ్రగ్ మాఫియాలను అరికట్టడంలో ప్రజా భాగస్వామ్యం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేసింది.



