నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి :మండలంలోని పుదిపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 17 బాలబాలికల కబడ్డీ జట్టు సెలక్షన్ జరిగింది.ఈ సెలక్షన్ ను మండల విద్యశాఖ అధికారి కేశవరెడ్డి ప్రారంభించారు. సెలెక్టైన క్రీడాకారులు నవంబర్ 21 నుండి 23 వరకు కర్నూలు లో జరిగే రాష్ట్ర స్థాయి చిత్తూరు జిల్లా తరపున పాల్గొంటారని, నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.




