నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*పాలసముద్రం*ప్రజా సమస్య లే పరిష్కార దిశగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి శివ అన్నారు. మంగళవారం పాలసముద్రం మండల అభివృద్ధి అధికారి సతీష్ తాసిల్దార్ గుర్రప్ప ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన సుడిగాలి పర్యటనలో పలు సమస్యలను ఎమ్మార్వో ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ సోమవారం మండలంలో పలు గ్రామాలను పర్యటించాలని అందులో డ్రైనేజీ , స్కూల్ కాంపౌండ్ వాల్ ,టాయిలెట్స్ లేవని అన్నారు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తెలియజేసి పరిష్కార దిశగా అడుగులు వేస్తానని తెలిపారు. అనంతరం కావేరిరాజపురం పంచాయతీలు 104 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మార్కెటింగ్ వైస్ చైర్మన్ అరుల్ నాదన్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు, సాంబశివ యూనిట్ కన్వీనర్ నవీన్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




