Wednesday, March 18, 2026

**తొర్రూర్‌లో అలజడి… వారసత్వ భూమిపై న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ !ఎస్సై ఉపేందర్‌పై చర్యలు తీసేవరకు దిగేది లేదన్న అంబేద్కర్ కాలనీవాసి మంగళపల్లి యాకంత **

నేటి సాక్షి – మహబూబాబాద (భూక్యా రవి నాయక్) | నవంబర్ 19తొర్రూర్ పట్టణం ఈ ఉదయం ఒక్కసారిగా జనసంచారం, అరుపులు, అల్లర్లు, పోలీసుల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే అంబేద్కర్ కాలనీ పరిసరాలు ఈ రోజు వాటర్ ట్యాంక్ పైన ప్రారంభమైన యాకంత ఆందోళనతో గందరగోళాన్ని తలపించాయి.అంబేద్కర్ కాలనీకి చెందిన మంగళపల్లి యాకాంత , తన కుటుంబానికి సొంతంగా రావాల్సిన వారసత్వ భూమి విషయంలో పోలీసు అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఉదయం తొలిగంటల్లోనే పట్టణ మధ్యలో ఉన్న భారీ వాటర్ ట్యాంక్ ఎక్కి, పై నుండి మైఖ్ లాగా అరుస్తూ ఆందోళన మొదలెట్టాడు.“ఎస్సై ఉపేందర్ కావాలనే నా భూమి రాకుండా అడ్డుకుంటున్నాడు! న్యాయం జరిగే వరకు దిగేది లేదు” — యాకంత గర్జనపై నుంచి యాకంత ఘాటుగా చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు, నినాదాలు అక్కడికి చేరుకున్న ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి.ఏకాంత మాట్లాడుతూ—“నాకు రావాల్సిన భూమిని ఎవరి ఒత్తిడికో భయపడి అడ్డుకుంటున్నారు!”“ఎస్సై ఉపేందర్‌ను వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేయాలి!”“ప్రజల హక్కులు లాఠీలతో కాదు, న్యాయంతో ఇవ్వాలి!”“నా సమస్యను పరిష్కరించే వరకు నేను ట్యాంక్ దిగను!”అంటూ నినాదాలు చేయడంతో మొత్తం ప్రాంతం హోరెత్తిపోయింది.ప్రజల రద్దీ, ఉద్రిక్తత—ట్యాంక్ కింద పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక దళాల హడావిడిఅతని చర్యతో ఒక్కసారిగా హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు:స్థానిక పోలీసు బలగంరెవెన్యూ అధికారులుఅగ్నిమాపక సిబ్బందిమునిసిపల్ సిబ్బందిసంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏకాంత ఎత్తైన వాటర్ ట్యాంక్‌పై నిలచి ఉండడంతో, ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తాళాలు తెచ్చి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.కాలనీ ప్రజలు, స్థానికులు సంఘటన స్థలానికి చేరి మద్దతు యక్కంత ఆరోపణలు క్షణాల్లోనే పట్టణమంతా వ్యాపించడంతో స్థానికులు, అంబేద్కర్ కాలనీ వాసులు, యువత, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అందరూ ఏకాంత చర్యకు మద్దతిస్తూ—“ఎస్సై దుర్వినియోగం వెంటనే ఆపాలి!”,“వారసత్వ భూమిపై న్యాయం జరగాలి!”అంటూ నినాదాలు చేశారు.అధికారుల చర్చలు, ఒత్తిడి — కానీ ఏకాంత మొండిగా ‘చర్యలు తీసేవరకు దిగను’అధికారులు ఎన్నోసార్లు పిలుస్తూ, అర్ధం చెబుతూ ప్రయత్నించినా, ఏకాంత మాత్రం ఎస్సైపై అధికారిక చర్యల ప్రకటన వచ్చే వరకు దిగేది లేదని పట్టు పట్టాడు.పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించబడ్డారు.భూమి వివాదం ఎందుకు? ప్రజల్లో చర్చ యకంత కుటుంబానికి వచ్చిన భూమి పత్రాలు ఇస్తున్న ప్రక్రియలో:ప్రభావశీలుల ఒత్తిడి?పోలీసు అధికారుల జోక్యం?రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం?అన్న అనుమానాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి.“ఒక కుటుంబం భూమి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే… ఇది సిస్టమ్ వైఫల్యం!” అంటూ పలువురు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.*పోలీసు శాఖ స్పందన కోసం ఎదురుచూపులు* యాకంత చేసిన ఆరోపణలు తీవ్రతరం కావడంతో జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాల్సి వచ్చింది.ఎస్సై ఉపేందర్‌పై విచారణ జరుగుతుందా? యాకంత కుటుంబానికి న్యాయం ఎప్పుడు?అనే ప్రశ్నలతో తొర్రూర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.తొర్రూర్ పట్టణం ఇప్పటివరకు ఎప్పుడూ చూసినట్లులేని పెద్ద హంగామా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో పట్టణంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.స్థానికంగా ఈ సంఘటన ఒక పెద్ద చర్చ, దుమారం రేపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News