నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలం కేంద్రం లో బుధవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డిస్టిక్ 320 జి గవర్నర్ సింహరాజు కోదండరాం నేతృత్వంలో మధుమేహ పరీక్షలు నిర్వహించారు .లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో 2018 నుండి 2025 సంవత్సరం వరకు లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు ఉచిత మధుమేహ బిపి పరీక్షలు నిర్వహిస్తున్నానమని , గన్నేరువరం హై స్కూల్ వద్ద రైతులకు పరీక్షలు చేసి మధుమేహం ఎక్కువ ఉన్నవారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో రూరల్ డయాబెటిక్ మెంబర్ లయన్ బూర శ్రీనివాస్, సెక్రటరీ లయన్ జీల ఎల్లయ్య ,ట్రెజరర్ లయన్ తెల్ల భాస్కర్ మరియు,బుర్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు.





