*(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 19:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో.. ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం మండల్ అధ్యక్షులు ఆవుల యాదయ్య ఆధ్వర్యంలో..రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది ముందుగా పార్టీ ఆఫీస్ దగ్గర ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన అనంతరం ఆవుల యాదయ్య మాట్లాడుతూ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ మన దేశం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలియజేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయాలు భారత రాజకీయాలలో కీలకమైనవి దేశ సమగ్రత మరియు అభివృద్ధికి ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 500 కే గ్యాస్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ఎన్నో ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగుతున్నాయని అలాగే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లాంటి పథకాలు నిర్వహించడం ఇందిరమ్మకి ఘన నివాళిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో.. కాకి ఈశ్వర్, ఎడమ మోహన్ రెడ్డి, అల్లే కుమార్, శివగంగా టెంపుల్ చైర్మన్, మార్కెటింగ్ వైస్ చైర్మన్ గ్రామ శాఖ అధ్యక్షుడు లాజర్ మార్కెట్ డైరెక్టర్ అల్లి బిక్షపతి నడికుడి శివ ఎన్ ఎస్ యు మంత్రి బాలరాజ్ బలెప్పగా కుమార్ యాదవ్ ఏపూరి నరసింహ గొల్లూరి రాజు యూత్ ప్రెసిడెంట్ పాండు నాయక్ మాజీ ఎంపీటీసీ రవీంద్రనాథ్ గ్రామ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళి అర్పించడం జరిగింది





