నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 19,…హెచ్డిఎఫ్సి,యాక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో హోం గార్డ్ సిబ్బందికి ఆరోగ్య భీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.నారాయణపేట: హోం గార్డ్ సిబ్బంది ఆరోగ్య, ప్రమాద బీమా దృష్ట్యా ఏదైన అనారోగ్య సమస్య ఏర్పడితే విధి నిర్వహణలో అనుకోని సంఘటనలో ప్రమాదం జరిగేతే వారి కుటుంబానికి ఆర్థిక బీమా,ఆరోగ్య బీమాకు సంబందించి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచలన మేరకు హెచ్.డి.ఎఫ్.డి, యాక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యయంలో అడిషనల్ ఎస్పీ MD రియాజ్ హుల్ సమక్షంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డ్ సిబ్బందికి ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యల పైన అవగాహనా కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంబంధిత బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకులలో ఖాతా కలిగిన సిబ్బంది ప్రతి సంవత్సరానికి 11,650/- రూపాయలు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలోని నలుగురు( భార్య ఇద్దరు పిల్లలకు)33 లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తిస్తుందని తెలిపారు. అలాగే హెచ్డిఎఫ్సి,యాక్సస్ బ్యాంకులలో శాలరీ అకౌంట్ కలిగి ఉండి ప్రతి నెల డెబిట్ కార్డు వినియోగిస్తే అనుకోని సంఘటనలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకి 30 లక్షల వరకు ఆర్దిక భీమా వర్తిస్తున్నదని తెలిపారు.ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పైన దృష్టి సరించాలని ఏదైనా అనుకోని సంఘటనలు జరిగిన, ఆరోగ్య సమస్యవస్తే ఇలాంటి బీమాలు ఎంతో దోహదపడుతాయన్ని తెలిపారు. అలాగే ఆర్థిక భద్రత పైన దృష్టి సరించాలని, సులువుగా లోన్ ఇస్తామని ఆశ చూపే యాప్ లలో లోన్లు తీసుకోవడం వల్ల అదిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారని, అలాంటి యాప్ లలో లోన్లు తీసుకోని ఇబ్బందులకు గురి కాకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇలాంటి బీమాలు ఎంచుకోవడం వళ్ల మీరు మీ పైన ఆధారపడిన కుటుంభం సభ్యులకు ధీమా కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇంచార్జ్ ఆర్ ఎస్సై మద్దయ్య, లు శ్వేత, శిరీష, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అధికారులు, సిబంది, హోం గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.





