Thursday, March 19, 2026

జాజాపూర్ లో ఆకట్టుకున్న55 మంది ఝాన్సీరాణులుసాహసానికి సంకేతం వీరనారి లక్ష్మీబాయి జీవితం….

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 19వీరనారి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జాజాపూర్ ఉన్నత పాఠశాలలో 55 మంది బాలికలు వీరనారి వేషధారణ ధరించి మణికర్ణిక నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిని గడగడలాడించి అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. పిల్లల్లో ధైర్య సాహసాలు నింపడం కోసమే ఝాన్సీ రాణి వేషధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. బాల బాలికలు ఆమెను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో, ధైర్యంతో ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈ మధుసూదన్ భాను ప్రకాష్ మంగళ శ్రీదేవి పి శిరీష టీ నిర్మల శశిరేఖ ఏ ప్రతాప్ నర్సింలు రఘురామేశ్వర్ రెడ్డి మాణిక్యప్ప మరియు వెంకటేష్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News