Thursday, March 19, 2026

నాలాల పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన సబితా ఇంద్రారెడ్డి *

(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 19:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి మున్సిపాలిటీ నబిల్ కాలనీలో నత్తనడకన జరుగుతున్న ఎస్‌ఎన్‌డిపి నాలా పనులను పరిశీలించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే *సబితా ఇంద్రారెడ్డి .* ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి అధికారులతో మాట్లాడుతూ :- ఎస్ ఎన్ డి పి నాలా పనులు ఎందుకు నత్తనడక నడుస్తున్నాయని,త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాల‌ని ఈ కాలనీలోని ప్రజలు చాలా కాలంగా మురుగు,వర్షపు నీటి సమస్యల కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని. పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదో సమగ్రంగా సమీక్ష చేసి, తక్షణమే సిబ్బందిని పెంచి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామ్, డీఈ, ఏఈ, ఎస్‌ఎన్‌డిపి విభాగాధికారులు, బిఆర్ఎస్ నాయకులు సుర్రెడ్డి కృష్ణారెడ్డి, అబ్దుల్లా, నబిల్ కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News