నేటి సాక్షి,నారాయణపేట,, నవంబర్ 19,నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల కు పర్మినెంట్ టీచర్ కావాలని బుధవారం నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఈసీ నెంబర్ సోషల్ మీడియా ఇన్ఛార్జి దాసరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అందుకు గాను ఎంఈఓ గారు వెంటనే స్పందించి మరికల్ ఎంఈఓ గార్కి ఫోన్ చేసి నాకు రేపటి వరకు ఇబ్రహీంపట్నం కు పర్మినెంట్ టీచర్ కావాలని చెప్పారు…ఇబ్రహీంపట్నం పాఠశాలకు రేపటి నుంచి పర్మినెంట్ టీచర్ వస్తారు అని డిఈఓ హామీ ఇచ్చారు.





