Thursday, March 19, 2026

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తాం – నాగేశ్వరావుచౌడేపల్లి నవంబర్ 20

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి : తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని చౌడేపల్లి మండల సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు నాగేశ్వర్ నాయుడు అన్నారు. గురువారం మండలంలోని ఆమిని గుంట గడ్డంవారిపల్లి, పెద్ద కొండామర్రి పంచాయతీ లలో సంస్థ గత ఎన్నికలను నిర్వహించారు.తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నాయకులు కార్యకర్తలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీగా చరిత్రకెక్కిందన్నారు.నూతనంగా ఎంపికైన కమిటీ లు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్గా పాల్గొని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.ఆమిణిగుంట పంచాయతీ అధ్యక్షుడిగా శంకర,పరికిదొన పంచాయతీ అధ్యక్షుడిగా చంగల్రాయుడు గడ్డంవారిపల్లి అధ్యక్షుడిగా మునివెంకటప్ప,పెద్దకొండామర్రి కి సుబహాన్ లను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అదేవిధంగా కమిటీ సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు హరిప్రసాద్ రాయల్,సీనియర్ నాయకులు,ఆవుల రామచంద్రయ్య,పంజాని పల్లి బాబు,విజయభాస్కర్ రెడ్డి,జంపాల శ్రీనివాసులు,వేలూరు సుబ్రహ్మణ్యం,పూల చంద్రమౌళి,ఆయా పంచాయితీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News