Thursday, March 19, 2026

కాగజ్‌నగర్. మార్కెట్‌లో నీటి నిల్వ సమస్యపై సబ్ కలెక్టర్ పరిశీలన

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 20కాగజ్‌నగర్ పట్టణంలోని మేయిన్ మార్కెట్‌లో పలు దుకాణాల ముందు రోడ్డుపై నీరు నిల్వ ఉండటం వల్ల దుకాణ యజమానులు, వినియోగదారులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటిలో జారి పడి పలువురు గాయాలపాలయ్యారని వ్యాపారులు తెలిపారు. ఈ మేరకు పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌కు సమస్యను తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, బుధవారం మార్కెట్ వ్యాపారస్తులు సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సబ్ కలెక్టర్ మార్కెట్ ప్రాంతంలోని సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం త్వరలోనే డ్రైనేజ్, కల్వర్ట్ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ. రాజేందర్, మున్సిపల్ సిబ్బంది, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News