నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిఅనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ఒక వరం అని బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు.బాపట్ల పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన 25 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ గారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సీయం సహాయ నిధి అందజేసి కూటమి ప్రభుత్వం వారికి ఆపదలో అండగానిలుస్తుందని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని,అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు సీయం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరింత మందికి ఈ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కల్లుగీత రాష్ట్ర అధ్యక్షులు తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షులు, కర్లపాలెం మండల అధ్యక్షులు పి వి పాలెం, మండల అధ్యక్షులు తదితరులు ఉన్నారు..





