నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ, బేగంపేట్ గ్రామం నుండి మండల కేంద్రం వరకు భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన మరియు నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు.మండలంలోని పలు ప్రధాన రహదారులు నెలలుగా అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. బేగంపేట్–బెజ్జంకి, బెజ్జంకి–గుండారం–కిష్టాపూర్, గుండారం–పేరకబండ–చౌడారం, బెజ్జంకి–కళ్లేపల్లి–రేపాక, బేగంపేట్–వడ్లూర్–ఖాసింపేట, వీరాపూర్–బేగంపేట్, దేవక్కపల్లి స్టేజ్–వరుకోలు బ్రిడ్జ్, బేగంపేట్–గునుకుల కొండాపూర్ వంటి రోడ్లు పూర్తికాక ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నట్టు వివరించారు.నిరసన అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు స్పందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రజల ప్రయాణం, అత్యవసర సేవలు, వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రభావితమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన పనులే తప్ప ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇంతవరకు రోడ్డు నిర్మాణ పనులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే రోడ్డు పనులను పూర్తి చేయాలని, లేదంటే మా నిరసనలను ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, కచ్చు రాజయ్య, చింతల పల్లి సంజీవ రెడ్డి, దుంభాల రాజా మహేంధర్ రెడ్డి,ముక్కిస తిరుపతి రెడ్డి, చేలుకల తిరుపతి రెడ్డి, హన్మండ్ల లక్ష్మారెడ్డి,ముక్కిస రాజిరెడ్డి, అన్నాడి సత్యనారాయణ రెడ్డి,రాగుల మొండయ్య,బండి రమేష్, ఎలుక దేవయ్య,ఎల శేఖర్ బాబు,ధీటి రాజు, చేలుకల కొండల్ రెడ్డి,బిగుల్ల మోహన్, బిగుల్ల దుర్గ సుదర్శన్,వంగల నరేష్,లింగాల బాబు,తల్లాపెళ్లి నరేష్,యలాల పర్షరాములు, ముక్కిస అంజిరెడ్డి,ఇట్టి రెడ్డి బాల్ రెడ్డి,ఆయిలేని నరసింహ రెడ్డి, కల్లూరి అజయ్ యాదవ్,చాతవేణి మహేష్, చిలుముల కిష్టయ్య,రామంచ పర్షరాములు,మాంకాల పొచమళ్ళు,మొగిలి తిరుపతి, మాతంగి చంద్ర శేఖర్,తదితరులు పాల్గొన్నారు.





