నేటి సాక్షి మహబూబాబాద్ (భూక్యా రవి నాయక్) నవంబర్ 20రాష్ట్ర పోలీసు విభాగం మొత్తం ఒకే వేదికపైకి చేరినట్లుగా—రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన నేర పరిస్థితులపై రాష్ట్ర స్థాయి భారీ క్రైమ్ రివ్యూ సమీక్ష అత్యంత విస్తృతంగా, వివరాలుగా సాగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి కీలక నేర గణాంకాలు, నేర పట్టణాల పెరుగుదల–తగ్గుదల వివరాలు, పెండింగ్లో ఉన్న కేసుల స్థితి, ముఖ్య విచారణల పురోగతి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లు, అక్రమ రవాణా, జూదాలు, గంజాయి–మాదక ద్రవ్యాల నిర్మూలన చర్యలు వంటి అనేక అంశాలను లోతుగా చర్చించారు.అంతేకాదు—మహిళలు, బాలికలు, శిశువుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా దుర్వినియోగం పై చర్యలు, శాంతి భద్రతపై ప్రభావం చూపే పరిణామాలు వంటి అంశాలను డీజీపీ గారు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.మహబూబాబాద్ జిల్లా ప్రాతినిధ్యం*జిల్లా తరఫున పాల్గొన్న ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్—*జిల్లా నేర ధోరణుల తతంగం,గత నెలలతో పోల్చిన నేర గణాంకాల మార్పులు,పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు,ముఖ్యమైన హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, ఎస్సీ/ఎస్టీ కేసులు, సైబర్ ఫిర్యాదులపై జరుగుతున్న దర్యాప్తు పురోగతి,పరిధిలో నిర్వహిస్తున్న ఓపెన్ హౌస్లు, శాంతి కమిటీ సమావేశాలు, ఇంటెన్సివ్ ప్యాట్రోలింగ్, సర్వైలెన్స్ వ్యవస్థ బలోపేతం,మద్యం–గంజాయి–అక్రమ రవాణాను నిలువరించే చర్యలువంటి అంశాలను వివరంగా డీజీపీ గారికి సమర్పించారు.*డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు*డీజీపీ గారు సమావేశంలో మాట్లాడుతూ—“ప్రతీ కేసు దర్యాప్తులో నాణ్యత అత్యంత కీలకం. ప్రజలకు స్పీడీ జస్టిస్ అందించడంలో ఒక్క కేసు కూడా నిర్లక్ష్యం తట్టుకోలేము. జిల్లా స్థాయిలో పోలీస్ యంత్రాంగం మరింత చురుకుగా, సమర్థవంతంగా, పారదర్శకంగా పనిచేయాలి” అని స్పష్టం చేశారు.అలాగే నేరాల నివారణకు ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగం, ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, మహిళల రక్షణకు స్పెషల్ డివిజన్ల పనితీరును ఇంకా బలోపేతం చేయాలని సూచించారు.*జిల్లా ఎస్పీ కేకన్ స్పందన*జిల్లా నేర పరిస్థితులపై మాట్లాడిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్—“ప్రజల రక్షణ విషయంలో రాజీ లేదు. జిల్లాలో నేరాలను పూర్తిగా అదుపులో ఉంచే దిశగా రోజువారీ పర్యవేక్షణ, ప్రత్యేక డ్రైవ్లు, ఇంటెన్సివ్ ఇన్ఫో కలెక్షన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాం. నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి” అని తెలిపారు.*జిల్లా బృందం హాజరు*ఈ రాష్ట్ర క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు వెర్టికల్ డీఎస్పీ మోహన్,డీసీఅర్బీ ఇన్స్పెక్టర్ ఉపేందర్,అదే విధంగా జిల్లా పోలీసు శాఖ నుంచి పలువురు అధికారులు పాల్గొన్నారు.





