Thursday, March 19, 2026

అంగన్వాడీ పిల్లలు పాలు తాగి అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన వైసీపీ నాయకులు

నేటి సాక్షి నవంబర్ 20 పాములపాడు:–మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ నెంబర్ 3 నందు నిన్నటి రోజున ఉదయం స్కూలు నందు పిల్లలకు ఇచ్చిన కోడిగుడ్డు పాలు తాగిన పిల్లలు యదావిదిగా స్కూలు వదిలిన తరవాత ఇంటికి చేరుకున్నారు.. ఆ సెంటర్‌ లో భోజనం తిన్న పిల్లలకు రాత్రి నుంచి 8 మంది చిన్నారులకు వాంతులు విరేచనాల తో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆత్మకూరు ప్రభుత్వ సిహెచ్ సి హాస్పిటల్‌కి ముగ్గురు తరలించారు.పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రికి నలుగురు పిల్లలను, నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరిని తీసికెల్లారు..వారి ఆరోగ్య పరిస్థితి గురించి నందికొట్కూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి డాక్టర్ దారాసుదీర్‌ మరియు వైసిపి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డిసిద్దార్థరెడ్డి మండల నాయకులకు పోన్‌చేసి వారి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వారికి తెలుపడం అయినది.అస్వత్థకు గురిఅయిన పిల్లలను ఈ రోజు హాస్పటల్‌ కి వెల్లి పరామర్శించిన వైసిపి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు యుగందర్‌ రెడ్డి వెంకటేష్‌ ,కో ఆప్షన్ ముత్తుజావలి, శివలింగం,గోపాల్‌,దర్గయ్య,శివ వైసిపి నాయకులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News