Thursday, March 19, 2026

*పశువైద్య కళాశాలలో రక్తదాన శిబిరం**

నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లో గురువారం రక్తదాన శిబిరం జరిగింది. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల, మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల సంయుక్తంగా కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఉదయం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కళాశాలలోని బోధన ,బోధనేతర, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*రక్తదానం– ప్రాణదానం: దాసరి శ్రీనివాస్*కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం కు ముందుకు రావాలని, మీరు ఇచ్చిన రక్తం రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు, చికిత్స నిమిత్తం రోగులకు ఎంతో అవసరం అవుతుందని, ఇలా దాతల నుండి సేకరించిన రక్తాన్ని వారికి అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సమయాల్లో కూడా రక్తదానం చేయడం అలవాటుగా చేసుకుంటే, ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి దోహదపడుతుందని, రక్తం నుండి ప్లాస్మా, ప్లేట్ లేట్స్, తెల్ల , ఎర్ర రక్త కణాలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలుపుతూ రక్తదాన శిబిరానికి రక్తదానం చేసేందుకు వచ్చిన కళాశాల సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ ఎం. శ్రీనివాస్, ఎం.స్రవంతి లతో పాటు పశువైద్య చికిత్సలయ హెడ్. డాక్టర్ నాగరాజు, గైనకాలజీ హెడ్. డాక్టర్ సునీల్ ఆనంద్, డాక్టర్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ శ్రీకాంత్,సురేష్, ప్రియాంకా, మోహితశ్రీ, శశాంక్, వెంకటేష్, కళాశాల బోధన, బోధనేతర, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News