Thursday, March 19, 2026

*సంస్కృత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్*

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిబడిన సంస్కృత పాఠశాలను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతులు, భోజనం మరియు ఫలహారాల నాణ్యత, ఉపయోగిస్తున్న సామాగ్రి తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం, నాణ్యమైన భోజనం మరియు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.*- అల్పాహారం పై ఆది ఆగ్రహం*ఉదయం పిల్లలకు అందించే బ్రేక్‌ఫాస్ట్ కిచిడి నాణ్యతను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్, అధికారులను హెచ్చరిస్తూ“విద్యార్థుల ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ లేదు… ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.ప్రతీ విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ధ్యేయం వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ఉమేష్, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓ జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News