నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తాటిపర్తి కరుణాకర్ రెడ్డిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ శుక్రవారం పరామర్శించారు.కరుణాకర్ రెడ్డికి ఇటీవల బోన్ ప్యాక్చర్ కాగా హైదరాబాద్ ప్రయివేట్ ఆస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని జగిత్యాలకు వచ్చారు.విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శుక్రవారం జగిత్యాలలోని కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.జాగ్రత్తగా మందులు వాడి కరుణాకర్ రెడ్డి ఎప్పటిలాగ కోలుకోవాలన్నారు.ఈ కార్యక్రమoలో బతికేపల్లి మాజీ సర్పంచ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి,శైలందర్ రెడ్డి, డాక్టర్ గురువారెడ్డి,మాజీ ఎంపిటిసి కృష్ణహరి,జగిత్యాల టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తాటిపర్తి పరీక్షిత్ రెడ్డి, కాడే సూర్యనారాయణ,జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి,రాజేశం,ఉపేందర్ రెడ్డి, పెయ్యాల రాజిరెడ్డి, తదితరులున్నారు.





