Thursday, March 19, 2026

*పత్రికా ప్రచురణార్థం* టిఆర్టిఎఫ్ 80వసంతాల విద్యాసదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన కోనరావుపేట మండల విద్యాధికారి మురళి నాయక్…హైదరాబాద్ లో జరిగే 80వసంతాల విద్యాసదస్సును విజయవంతం చేయండి…టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్..

నేటిసాక్షి ప్రతినిధి:డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80వసంతాల అభ్యుదయోత్సవ వేడుకల విద్యాసదస్సు పోస్టర్ ను కొనరావుపేట మండల విద్యాధికారి మురళి నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్) 1944 లో స్వాతంత్ర పూర్వం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పడిన ఏర్పడిన సంఘమన్నారు. మొదట ఏపీటిఎఫ్ ఏర్పడిన సంఘం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్టిఎఫ్ గా అవతరించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ఉద్యమిస్తున్న సంఘం అన్నారు. అనంతరం టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ… నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల హక్కుల కొరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తూ 80 సంవత్సరాలు గడిచిన సందర్భంగా డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80వసంతాల అభ్యుదయోత్సవ వేడుకల విద్యాసదస్సుకు ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై తెలంగాణ రాష్ట్రం టీచర్ ఫెడరేషన్ 80 వసంతాలు రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, మండల విద్యాధికారి మురళి నాయక్ , కాంప్లెక్స్ హెచ్ఎం జ్ఞానేంధర్ బాబు, సిఆర్పి రవితేజ, టి ఆర్ టి ఎఫ్ నాయకులు, బడ్డిగం మంగళ, సంధ్యారాణి, వడ్డేపల్లి మాధవి,ఉచ్చిడి సంగీత, మిట్టపల్లి సుమలత, మాడుగుల రేణుక, గంగవరం శ్రీధర్, బి శ్రీనివాస్, గోలి రాధకిషన్, మమత , కవిత, రాజు, రఘుపతి, చందన, ప్రవళిక, మామిడాల రమేష్, గాజెంగి విష్ణు,పోతుగంటి రమేష్, జయ కృష్ణారెడ్డి, అపర్ణ, మహేందర్ రావు, సమీనా బేగం, స్వప్న, మహేష్, సతీష్, రమాకాంత్, శ్రీలత, వెంకటేశం, విజయ, కిరణ్మయి , సంజీవ్, శ్యాంసుందర్, భాస్కర్ రెడ్డి, సురేష్ వీణ, రమ్య శ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News