నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)వెదురు కుప్పం మండలంలోని డాక్టర్ వై.ఎస్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెదురు కుప్పం గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో *గ్రంథాలయ వారోత్సవాల* సందర్భంగా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని *కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద* ఆవిష్కరించారు.వివిధ రంగాలకు చెందిన అనేక పుస్తకాలు ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో *లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్ బి.సతీష్ కుమార్, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ.సీ.భరణినాథ్ రెడ్డి* అధ్యాపక,అధ్యాపకేత్ర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





