నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 21చౌడేపల్లి మండలం, వెంగళపల్లి గ్రామం & పంచాయతికి చెందిన పి. నరసింహులు కుమార్తె పి. ఆదిలక్ష్మి, వయస్సు 37 సంవత్సరాలు, ఈమె సోమల మండలం ఆవులపల్లి సచివాలయంలో కాంట్రాక్ట్ బేసిక్ ANM గా పని చేస్తున్నారు. ఈమెకు సుమారు మూడు సంవత్సరాల క్రితం వెంగళపల్లి పంచాయతీ గాజులపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ తో వివాహం జరిగినది. గంగాధర్ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ బేసిక్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. వీరికి సుమారు 9 నెలల వయసుగల క్రితిక అను పేరు గల కుమార్తె కలదు. ఆదిలక్ష్మి తన కుమార్తె వయసుకు తగిన బరువు లేదు, కాళ్లు చేతులు యాక్టివ్’గా కదిలించడం లేదు, ఇంకా పాకడం లేదు నడవడం లేదు అంటూ ఎప్పుడూ ఆందోళన చెందుతూ మదనపల్లి, పీలేరు, తిరుపతి, హైదరాబాదు ఊర్లలోని హాస్పటల్లో డాక్టర్ల వద్దకు వెళుతూ ఉండేది, డాక్టర్లు కూడా ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం ఇబ్బంది లేదు అని చెప్పిన ఆదిలక్ష్మి ఆందోళన చెందడం ఆపలేదు, భర్త , బంధువులు , స్నేహితులు ఎందరు చెప్పినా ఆదిలక్ష్మి తన కూతురు గురించి ఆందోళన చెందడం ఆపలేదు, అదేవిధంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున తన తండ్రి ఇంటి నుండి తన కుమార్తెను తీసుకుని ఇంటిలో వారికి చెప్పకుండా దగ్గర్లో ఉన్న చెక్ డాం వద్దకు వెళ్లిన ఆదిలక్ష్మి తన కుమార్తెతో పాటు నీళ్లలో మునిగి చనిపోయి కనిపించింది. తండ్రి నరసింహులు బంధువుల సహాయంతో తన కూతురు ఆదిలక్ష్మి తన మనవరాలు క్రితిక గురించి వెతికి వారి చనిపోయి ఉన్న చెక్ డాం వద్దకు చేరుకొని నీటిలో మునిగి మరణించి ఉండడం గమనించాడు. ఫిర్యాదు నరసింహులు తన కుమార్తె ఆదిలక్ష్మి మరణంపై ఆమె భర్త గంగాధర్ మీద గాని, అతని కుటుంబ సభ్యుల మీద గాని ఎటువంటి అనుమానం లేదని తెలిపారు. దీనిపై చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం ఒంటిగంటకు ఫిర్యాదు చేయగా Cr.No.100/ 2025 U/Sec. 194 BNSS ( Death by Drowning ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.





