[నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్) మరో మారు మానవత్వం చాటుకున్న బాపట్ల అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు విన్నకోట సురేష్, కొనపురెడ్డి ఉమామహేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడం జరిగింది. శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్, క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన కొండుబొట్లు వారిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు కూనపురెడ్డి ఉమామహేశ్వరరావు జీవితంలో చివరి కోరికగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవాలని ఆశపడ్డారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే ఆయన మరణించడం తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు.. వారి కుటుంబానికి ప్రకాడ సానుభూతి తెలియజేశారు. ఉమామహేశ్వరరావు కుమారుడును చదివించే బాధ్యతను నేను తీసుకుంటానని అలాగే అతను ఎంతవరకు చదువుకుంటాడో అంతవరకు చదువుకు అయ్యే ఖర్చు మొత్తం నేను ఇస్తానని జనసేన నాయకులు విన్నకోట సురేష్ వారి కుటుంబానికి భరోసా కల్పించారు.. అలాగే నల్లమోతు వారి పాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు గరిగంటి సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ,జనసేనా నాయకులు తదితరులు ఉన్నారు.[21/11, 6:13 pm] +91 93981 75211: *రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం*నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధిరోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ముందుకు వెళ్తున్నామని సభ్యుడు పులిపాటి అమ్మయ్య అన్నారు.ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాపట్ల గుంటూరు రహదారిలోని బిడ్జి వద్ద రోడ్డు ప్రమాదాలకు గురి కావొద్దు అంటూ హెచ్చరిక బోర్డును శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ బాపట్ల పరిసర ప్రాంతాలలో రోజురోజుకు ప్రమాదాలు అధికమవుతున్నయని వాటిని నివారించేందుకు మా ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు – బాపట్ల రహదారిలో మా సభ్యులు పులిపాటి అమ్మయ్య ఆర్థిక సహాయంతో హెచ్చరిక బొడ్డును ఏర్పాటు చేశామని, బాపట్ల – కర్లపాలెం రహదారి, సూర్యలంక బాపట్ల రహదారి, బాపట్ల – చీరాల రహదారిలో మరిన్ని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు విశేష కృషి చేస్తున్నారని వారికి చేదోడుగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ మరింత కృషిచేసి ప్రమాదాలను నియంత్రణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, షేక్ సుభాని, బీమా కోటేశ్వరరావు, ఏసోబు, తన్నీరు గోపి, బండ్రెడ్డి అంకమ్మరావు, పెద్దమళ్ళు శ్రీకాంత్, నరాలశెట్టి సుబ్బారావు, బోట్టు కృష్ణ, యాసం రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

