నేటి సాక్షి 21 పాములపాడు :–మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని, మొక్కలను పెంచి పచ్చదానాన్ని పెంపోoదించుకుందామని సుస్థిర అభివృద్ధి కోసం పాటుపడుతూ వాటి లక్ష్యాలను చేరుకోవాలని ఎంపీడీవో ఎన్ చంద్రశేఖర్ డిప్యూటీ ఎంపీడీవో సులోచన అన్నారు. శుక్రవారం మండలంలోని రుద్రవరం గ్రామంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా క్లీన్, గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో ఎంపీకైన రుద్రవరం గ్రామంలో పారిశుద్య శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గేర్డులు గ్రామము మొత్తము తిరిగి ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి అన్ని వీధుల వెంట ఉన్న చెత్త చెదారంను శుభ్ర చేయించారు. అదేవిదంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు గ్రామాల ప్రజలు సహకారం అందించాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు. అదేవిధంగా మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మీ అలాగే వాటి ద్వారా గాలి, వాతారణ కాలుష్యాన్ని నివారించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు.





