Thursday, March 19, 2026

*మహేశ్వరం ఆర్టీసీ బస్సులో కిచ్చన్న**ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో ముచ్చట**రోజూ 36వేల మంది ఆడపడుచుల ప్రయాణం*

*( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 21:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రతీ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు రూ.3000 నుంచి రూ.4వేలు ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు. మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి పలువురు మహిళా ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36 వేల మంది మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు కె ఎల్ ఆర్ స్పష్టం చేశారు.రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం, కందుకూరు మండలాలకు ప్రతీ ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని కిచ్చెన్నగారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి సహా మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీలు, గ్రామ, బూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News