Thursday, March 19, 2026

ఘనంగా మరికల్ లో ఫ్రూట్స్ డే…

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 22,ఫ్రూట్స్ డే సందర్భంగా రిషి హై స్కూల్, మరికల్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఆనందభరితంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అత్యుత్సాహంగా పాల్గొని, వివిధ రకాల పండ్ల గురించి అవగాహన పెంచే విధంగా సృజనాత్మక ప్రదర్శనలు చేశారు. చిన్నారులు తమతమ తరగతుల వారీగా పండ్ల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి వినియోగంపై ఆకర్షణీయమైన మోడల్స్, డ్రెస్సింగ్, స్పీచెస్ ద్వారా అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోకరస్పాండెంట్ రమేష్ శెట్టి,ప్రిన్సిపల్ సోజిష్ ,స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డిసీనియర్ ఉపాధ్యాయులు వెంకటరెడ్డి గారు,తదితర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఫ్రూట్స్ డే ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారం, పండ్ల ప్రాముఖ్యత, శరీరానికి పండ్లు కలిగించే ప్రయోజనాలు వంటి అంశాలపై అవగాహన కల్పించబడింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల ప్రతిభను అభినందించారు.రిషి హై స్కూల్ తరఫున, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి విద్యా-సాంస్కృతిక కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించనున్నామని తెలియజేస్తున్నాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News