Thursday, March 19, 2026

కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం… కొనుగోలు కేంద్రాల్లో అవినీతికి తావు లేదు నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్

నేటి సాక్షి,నల్లబెల్లి నవంబర్ 22 :కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం . కొనుగోలు కేంద్రాలలో అవినీతికి తావు లేదు నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండలం ముచ్చింపుల, రంగాపురం, రేలకుంట గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు ఇస్తారి వాసవి, ఉప్పుల సృజన, వెంగళదాసు మంజుల ఆధ్వర్యంలో, ఏపీఎం సుధాకర్ సమన్వయంతో, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జంగిలి మమత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు.తరువాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.అన్నదాతకు అండగా నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని, వరి ధాన్యానికి మద్దతు ధర 2389 రూపాయలతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడం రైతులకు పెద్ద సహాయమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను రాజులుగా నిలబెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలంటూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత బన్న, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధూరి తిరుపతిరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారి శేఖర్ గౌడ్, వైనాల అశోక్, నాయకులు ఎర్రబెల్లి రఘుపతిరావు, జిల్లా మునీందర్, జెట్టి రామ్మూర్తి, వెంగళదాసు రమేష్, జంగిలి మోహన్, జంగిలి శంకరయ్య, సిసి సాంబయ్య, ఏఈఓ శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News