-నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………….ఈరోజు జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ బాధ్యతలు స్వికరించారు.జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వికరించిన అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేయడం జరిగింది.వేములవాడ ఏ ఎస్పీగా పనిచేస్తున్న శేషాద్రిని రెడ్డిని ఖాళీగా ఉన్న జగిత్యాల అదనపు ఏ ఎస్పీ (పరిపాలన) స్థానంలో నియమించారు.స్వస్థలం నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని లింగారెడ్డి గూడెం.ఐఐటి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివి 2020 లో సివిల్స్ తొలి ప్రయత్నం లోనే 401 ర్యాంకుతో ఐపీఎస్ కు ఎంపీ అయ్యారు.గత ఏడాది వేములవాడలో తొలి పోస్టింగ్ తీసుకున్నారు.





