Thursday, March 19, 2026

*జగిత్యాల జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో వింటర్ కార్నివాల్*—————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………….జగిత్యాల పట్టణంలోని జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో *” వింటర్ కార్నివాల్”* పేరిట కార్యక్ర మం నిర్వహించారు. దీనిలో విద్యార్థులకు శీతాకా లం గురించి వివరించారు. ఈ శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండి మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సీజన్ లో చాలా ఆరోగ్యకరమైన పండ్లు మరియు కూర గాయలను తెస్తుంది. ప్రజలు తాజా ద్రాక్ష, యాపిల్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్, జామ మరియు మరిన్ని తినడానికి అవకాశం పొందుతారు. ఇంకా, ఈ సీజన్లో చాలా అందమైన పువ్వులు వికసిస్తాయి అని అన్నారు. అదే విధంగా శీతాకాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, ధరించాల్సిన దుస్తువుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, రజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News