Thursday, March 19, 2026

*ఎస్బీఐ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ విజిలెన్స్ అవేర్‌నెస్ వర్క్‌షాప్‌ ప్రారంభం** ప్రారంభించిన ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నక్కా ఆనంద్ బాబు

నేటి సాక్షి, గుంటూరు జిల్లా ప్రతినిధి ఎస్బీఐ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ విజిలెన్స్ అవేర్‌నెస్ వర్క్‌షాప్‌ తో ఎంతో ఉపయకరమని ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు. ప్రారంభంగుంటూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన SC, ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విజిలెన్స్ అవగాహన సదస్సు వర్క్‌షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని ప్రేమగా “బాబా” అని పిలుచుకుంటానని, ఒక ఆడపిల్లగా చదువుకునే అవకాశం, హక్కులు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ అంతా ఆయన వంటి మహనీయుల పోరాట ఫలితమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. కమ్యూనిటీ గౌరవం పుట్టుకతో కాక వ్యక్తిత్వం, ప్రతిభ, కృషి ద్వారా వస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. ఎస్బీఐ సేవలు దేశవ్యాప్తంగా విశ్వసనీయమైనవని, బ్యాంకులో మహిళా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం బాధాకరమని, వారికి మరింత అవకాశాలు కల్పించాలని కోరుతూ, బ్యాంక్ కు వచ్చే మహిళలకు సపోర్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. అంబేద్కర్ కోరుకున్న సమానత్వం వేదికలపై కూడా ప్రతి ఫలించాలని, పురుషులతోపాటు మహిళలు సమానంగా ప్రాతినిధ్యం వహించాలన్నారు. అసోసియేషన్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు, అజెండాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, నిష్పక్షపాత అజెండాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే తన దగ్గరకు వ్యక్తిగతంగా రావచ్చని, సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చి, కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News