Thursday, March 19, 2026

*దేశానికి యువతే భవిష్యత్తు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

నేటి సాక్షి, గుంటూరు జిల్లా ప్రతినిధి భవిష్యత్తు అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.గుంటూరు 32వ డివిజన్‌లోని బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన ఉత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువజనోత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు యువత ప్రతిభను అగ్రస్థాయికి తీసుకెళ్లే అత్యుత్తమ వేదిక అని, ఇలాంటి అవకాశాలను ఒకసారి కోల్పోతే తిరిగి రావని, అందుకే ప్రతి విద్యార్థి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. సక్సెస్ అంటే కేవలం డాక్టర్, ఇంజనీర్ లేదా పొలిటికల్ లీడర్ అవ్వడం కాదని, సంతోషంగా ఉండే రంగంలో రాణించడమే నిజమైన విజయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. నేటి సమాజం ఓపెన్ ప్లాట్‌ ఫారమ్‌లా మారి సమాన అవకాశాలు అందిస్తున్నందున, తమ లక్ష్యాల సాధనలో దృఢంగా ముందుకు సాగాలని యువతకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.ఆడ-మగ సమాన అవకాశాలు సాధారణం కావాలని, దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యాక్టర్ ఒక ఐడల్ కావొచ్చు కానీ నిజమైన హీరోలు అంబేద్కర్, భగత్ సింగ్, వివేకానందలాంటి మహనీయులు. వారి త్యాగాలు, వారి విలువలు మనకు జీవన మార్గం” అని వివరించారు. ఒక కల – దానికి జోడించిన నాలెడ్జ్ – దాన్ని సాధించేందుకు పెట్టిన డెడికేషన్ అనే మూడు సూత్రాలే విజయ రహస్యం అని యువతకు స్పష్టం చేశారు. ఈ మూడు పాటిస్తే ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News