Thursday, March 19, 2026

*చట్టాలపై అవగాహన తప్పనిసరి*—-* జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి—*

నేటి సాక్షి – మల్లాపూర్*( మహేష్ పెంబి )యువతతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ చట్టాలపై సరైన అవగాహన అవసరమని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిట్టూరి రత్న పద్మావతి అన్నారు. శనివారం మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.*చట్టం తెలీదని చెప్పడం..బాధ్యతారాహిత్యం*ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. నేటి కుమారులు, కుమార్తెలు తమ వృద్ధాప్య తల్లిదండ్రులను పోషించడం చట్టపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. తప్పులు చేసిన తర్వాత ‘చట్టం తెలియదు’ అనటం బాధ్యతారాహిత్యమని విద్యార్థులకు హెచ్చరించారు. క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.అంతకుముందు పాఠశాలలో కీ.శే. రుద్ర బుచ్చిరాజం స్మారకార్థం నిర్మించిన సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె— చదువుల తల్లి విగ్రహ ఆవిష్కరణ తనకు మరచిపోలేని అనుభూతిగా నిలిచిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు న్యాయమూర్తి సుగాలి నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, జూనియర్ సివిల్ జడ్జిలు నారం అరుణ్ కుమార్, కాసుల్ల పావని, డీఎస్పీ రాములు, జిల్లా విద్యాధికారి రాము, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, రిటైనర్ లాయర్ కాజీపేట స్రవంతి, కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి సురేష్, సీఐ అనిల్ కుమార్, ఎస్సైలు రాజు, కిరణ్ కుమార్, అనిల్, ప్రిన్సిపాల్ మచ్చుకంటి భూమేశ్వర్, తహసీల్దార్ రమేష్ గౌడ్, యంఈవో దామోదర్ రెడ్డి, విగ్రహ దాత రుద్ర రాం ప్రసాద్, లోక్ అదాలత్ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News