*నేటి సాక్షి బాపట్ల జిల్లా (చెరుకుపల్లి) జిల్లాలో రైతులు పండించిన వరి ధ్యానం ప్రభుత్వం కొనుగోలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.శనివారం చెరుకుపల్లి మండలం,గుడువల్లి గ్రామం నందు రైతు సేవా కేంద్రం లోని వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతు పండించిన వరి ధాన్యం ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవ్వరు కూడ ఆందోళన పడవలసి అవసరం లేదని రైతులకు చూచించారు.రైతులకు అవసరమైన అందరికి గోని సంచులు,టారపల్ పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు వరి ధాన్య మును బాగా ఎండిన తర్వాత నే మీ సమీపంలోని వరి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.వరి లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా రైతులు గుర్తించుకోవలన్నారు.ఏ గ్రేడ్ వరి రకం రూ.2389,సాధారణ రకం రూ.2369 ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.జిల్లా లో 117 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గత సంవత్సరం లో జిల్లాలో 90 వేల క్వింటాలు కొనుగోలు చేయడం జరిగిందని,ఈ సంవత్సరం 2 లక్షల క్వింటాలు వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పౌర సరాఫరాల శాఖ డి యం.శివపార్వతి, డి ఎస్ ఓ.సిబ్బంది రైతులు తదితరులు ఉన్నారు.





