నేటి సాక్షి,నల్లబెల్లి నవంబర్:22: నల్లబెల్లి ఉన్నత పాఠశాలకు చెందిన హారిక, మహాలక్ష్మి, అక్షిత లు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాలలో ప్రావీణ్యం సాధించిన చిన్నారులను పి ఆర్ టి యు టి ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఘన సన్మానం జరిపారు. అధ్యక్షుడు ఉడుత రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ముందుండాలి.ప్రతిభావంతులైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మరింత రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి ఎంపికకు కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య, ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు లడే రవీందర్, డి.శ్రీధర్‌బాబు, పురం. బద్రీనాథ్,జిల్లా బాధ్యులు కే.నాగరాజు, శనిగరం శ్రీనివాస్,సీనియర్ ఉపాధ్యాయులు ఏ.పద్మజ, బి.ప్రమీల, కె.భారతి ఇతరులు పాల్గొన్నారు. విద్యార్థులను మరింత శ్రద్ధగా అభ్యసించి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకోవాలని పలువురు ఆకాంక్షించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.





