Thursday, March 19, 2026

సిర్ సిల్క్ కాలనీలో కొత్త వైన్ షాప్‌కు అనుమతి నిలిపివేయాలంటూ డిమాండ్

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 22కాగజ్‌నగర్ ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ మొబీన్, జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ నియాజుద్దీన్ నాయకత్వంలో సిర్పూర్ కాగజ్‌నగర్ సిర్ సిల్క్ కాలనీ. మద్యం దుకాణం ఏర్పాటు పై ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా కు మెమోరండం ఇవ్వడం జరిగింది సరసిలక్.ఆర్బీ రోడ్డుపై కొత్త వైన్ షాప్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అక్కడ సమీపంలో ఒక పాఠశాల, చర్చి మరియు మస్జిద్ ఉన్న నేపధ్యంలో ఆ ప్రాంతం వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, కొత్త వైన్ షాప్‌కు అనుమతులు మంజూరు చేయవద్దని వారు సబ్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.వారి అభ్యర్థనపై స్పందించిన సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా.100 మీటర్ల పరిధిలో ఉంటే అనుమతి ఇవ్వబడదు.అని భరోసా ఇచ్చారు. ఇట్టి విషయంపై 100 మీటర్లు పైన ఉన్న వాటికి మద్యం దుకాణానికి వేలం వేయాలి కానీ జన సంద్రంలో గుడి చర్చి మరియు మసీదు పాఠశాలలు ఉన్నచోట ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు ఈ విషయంపై స్థానిక కాగజ్నగర్ పట్టణ ప్రొఫెషనల్ ఎక్సైజ్ వారికి కూడా మెమోరడం ఇవ్వడం జరిగింది ఎంఐఎం అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలు ఏమి కోరుకుంటే అదే పని ప్రభుత్వం చేయాలని ప్రజలు కు ఎలాంటి ఇబ్బందులు కడగకుండా ప్రభుత్వ పరమైన వ్యాపారం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ పట్టణ ఎంఐఎం పార్టీ చెందిన నాయకులు మరియు కాలనీవాసులు ప్రజలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News