Thursday, March 19, 2026

డీసీసీ అధ్యక్షుడికి పలువురి శుభాకాంక్షలు

నేటిసాక్షి, కరీంనగర్‌:కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నూతన అధ్యక్షులుగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఆదివారం కాంగ్రెస్‌ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో చిత్రపటం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ కాంగ్రెస్‌ స్థాయి నుండి కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేతగా పనిేసిన మేడిపల్లి సత్యం అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్‌ మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడమే కాకుండా నియోజకవర్గ కార్యకర్తల కష్టసుఖాలను పంచుకోవడంలో ముందుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలందరి ఆశీస్సులతో ఈరోజు కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా నియమితులవడం హర్షించదగ్గ విషయమన్నారు. వారి వెంట డీసీసీ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు దొంతి గోపి, నూనె గోపాల్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్‌, గంగాధర మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు పురుమళ్ళ మనోహర్‌, కోల ప్రభాకర్‌, బైరిశెట్టి సంపత్‌, కుంభాల రాజకుమార్‌ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News