Thursday, March 19, 2026

*భోజనం నాణ్యత మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవు:-జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు హెచ్చరిక.*

నేటి సాక్షి 23 నంద్యాల జిల్లా కొత్తపల్లి :– హాస్టల్ విద్యార్థులకు భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- లింగాల.నాగరాజు హెచ్చరించారు నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయలు, నిత్యవసర వస్తువులు, బియ్యం పరిశీలిస్తూ డీవీఎంసీ మెంబర్- లింగాల.నాగరాజు మాట్లాడుతూ హాస్టల్లో కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి కూరలు వండాలని ఆయన అన్నారు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని మధ్యాహ్న భోజనం చికెన్, మజ్జిగ, గోంగూర, చట్నీ ప్రభుత్వమిచ్చిన మెనూలో ఉండగా చికెన్ కర్రీ మాత్రం చారు చారు చేసి అన్నంలో కూడా కలవకుండా నీళ్లు నీళ్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు ఎక్కువ రోజులు నిలువ ఉంచకుండా, ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి కూరలు వండాలని ఆయన హెచ్చరించారు. భోజన విషయంలో పిల్లలకు సమయానికి పెట్టాలని, నిర్లక్ష్యం చేస్తే సహించమని విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించి, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా హాస్టల్ వార్డెన్స్ చూసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News