Thursday, March 19, 2026

గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి గ్రామ పరిసర ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తన్నపేట్‌కు చెందిన కనగండ్ల అజయ్, ఇల్లంతకుంట మండలం సోమవారం పేటకు చెందిన తడకపల్లి శేఖర్‌ను బెజ్జంకి పోలీసులు పట్టుకున్నారు. మొదట గంజాయి సేవిస్తుండగా గుర్తించిన పోలీసులు, వారి పాత నేర చరిత్రను పరిశీలించగా ఇద్దరూ గంజాయి విక్రయం, వినియోగంలో తరచుగా పాలుపంచుకుంటున్నట్లు బయటపడింది.కనగండ్ల అజయ్ 2022లో బెజ్జంకి పీఎస్‌లో గంజాయి కేసులో అరెస్టై జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తడకపల్లి శేఖర్‌పై కూడా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి.ఇద్దరిపై కొత్త కేసులు నమోదు చేసి, సిద్దిపేట రూరల్ సీఐ ఎం. శ్రీను పర్యవేక్షణలో రాజగోపాలపేట ఎస్సై వివేక్, చిన్నకోడూరు ఎస్సై సైఫ్ దర్యాప్తు నిర్వహించి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.గ్రామాల్లో గంజాయి విక్రయించే, సేవించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో జరుగుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత గంజాయి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని ఏఎస్ఐ శంకర్ రావు హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News