నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)నవంబర్ 23*రామచంద్రాపురం* మండలంలోని రాయలచెరువు పంచాయతీకి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు పెనుగొండ లోకేష్ ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెలిసిందే. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన లోకేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణి యామినికి రూ. 5 లక్షల చెక్కును ఆదివారం తాడేపల్లిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు నాగబాబు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భములో మీడియాతో దేవర మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీలో ప్రతి కార్యకర్త ఓ కుటుంబ సభ్యుడేనని పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన లోకేష్ సేవలు మరువలేనివి. కష్టసమయంలో కార్యకర్తల కుటుంబాల పక్కనే నిలబడటం పార్టీ ధర్మం, సంస్కారం.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో కార్యకర్తల భద్రత, గౌరవం కోసం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. లోకేష్ కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ అండగానే నిలుస్తుంది అని స్పష్టం చేశారు.* క్రియాశీలక వాలంటీర్ హరి కృషి ప్రశంసనీయం.. దేవర మనోహర్*చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తకు మొదటిసారిగా ప్రమాద భీమా చెక్కు జారీ కావడం విశేషం. లోకేష్ కుటుంబ సభ్యుల కోసం క్రియాశీలక వాలంటీర్ హరి చేసిన కృషి, నిబద్ధత, నిరంతర ప్రయత్నాలే కారణమని అని చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ పేర్కొన్నాయి. లోకేష్ కుటుంబం పట్ల పార్టీ వ్యక్తం చేసిన ఈ అండ ప్రభుత్వ సేవాస్ఫూర్తికి, పార్టీ శ్రేయోభిలాషుల పట్ల చూపే ఆదరణకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని దేవర మనోహర్ వెల్లడించారు.





