Thursday, March 19, 2026

పేదల అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం

నేటి సాక్షిన్యూస్ చౌడేపల్లి నవంబర్ 23: చౌడేపల్లి మండలం ఎర్రగానిపల్లెలో విజయవంతం గా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్.,పేదల అభివృద్దే ద్యేయం గా ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్ములన లో భాగంగా కొనసాగుతున్న సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పి ఫోర్ ప్రాజెక్టు ఆకాంక్ష,బంగారు కుటుంబాలను ఆదర్శం గా నిలిచిన మార్గదర్శి లక్ష్మణ రాజు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టత్మాకంగా తీసుకొన్న పి 4 ప్రభుత్వ మరియు ప్రవేటు ప్రజా భాగస్వామ్యం ప్రాజెక్టును చౌడేపల్లి కి చెందిన లక్షణ్ రాజు, సుదర్శన్ రాజు, ప్రదీప్ రాజు లు ముందడుగు లు వేశారు.ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని ఎర్రగాని పల్లె లోని (ఎస్టీ)యానాదులు గత పది సంవత్సరాల కాలం పాటు ఉండటానికి ఇల్లు లేక సొంత గృహాలు లేక అడవిలో ఎండ వానలకు చెట్ల క్రింద నివాసం లో కొట్టుమిట్టాడాతు మాదిరాజు లక్షణ రాజు ను ఆశ్రయించారు.గత ప్రభుత్వం లో అనేకమంది ని కలసిన ఎవరు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు.వారికి సాయం అందించేందుకు తోలుతగా పూరి గుడిసెలు ఏర్పాటు చేసి అనంతరం హోసింగ్ స్కీమ్ క్రింద పనులను నిలిచి పోయిన గృహలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శలను నిజం చేసేందుకు పి ఫోర్ ప్రాజెక్టు కింద ఇంటి నిర్మాణ పనులను చేపట్టి మూడు కుటుంబాలకు నూతన గృహాలు ఏర్పాటు తో పాటు విద్యుత్,నీటి తో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించి నేడు వారితో కలసి నూతన గృహప్రవేశాలు గావించి వారికి కావలసిన నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది.ఈ సందర్బంగా లక్షణ్ రాజు(పతి)రాజు మాట్లాడుతూ పేదల అభివృద్దే ద్యేయంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ పిఫోర్ ప్రాజెక్టు కి చౌడేపల్లి మండలం నందు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోదాయకమని,నేడు ఉండటానికి ఇల్లు లేని నిరుపేదలకు మేము ఇండ్లు నిర్మించి నివాసం కల్పించడం తో పాటు వారికి మౌలిక వసతులు కల్పించడం జరిగినదని ఉన్నదానిలో కొంత అయినా పేద వారికి సహాయం చేయడం మాకు ఆనందంగా ఉందన్నారు.వీరితో పాటుగా ఎనిమిది కుటుంబాలు ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామని మా దృష్టికి వచ్చింది ఈసందర్బంగా వారికి కూడా పి ఫోర్ ప్రాజెక్టు అధికారులతో కలసి త్వరలోనే వారికి కూడా గృహాలు నిర్మిస్తామని అన్నారు.కార్యక్రమం లో పి ఫోర్ ప్రాజెక్టు అధికారులు కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రాఫిషనల్ పి. బి.మోహన్ టీమ్, స్థానిక తెలుగుదేశం నాయకులు పగడాల హరిప్రసాద్ రాయల్,యువనాయకుడు కార్తీక్,మాదిరాజు ప్రదీప్ రాజు,తెలుగు యువత నియోజక వర్గ ఉపాద్యక్షులు నాగరాజ రెడ్డి, నారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News