నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 23 :చౌడేపల్లి మండలం లో జరుగుతున్న సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర పాల ఏకిరా కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు అన్నారు. చౌడేపల్లి మండలంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సంస్థ గత ఎన్నికలకు ఆయన పరిశీలకుడిగా నియమితులై ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా జరుగుతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నిక అవుతున్న కె ఎస్ ఎస్ సభ్యులు పంచాయతీ కమిటీ చురుగ్గా పాల్గొని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు రాబోయే ఎలాంటి ఎన్నికలు అయిన సునాయసంగా విజయం సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గ్రామంలోని నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసే ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం పుదిపట్ల, లద్దిగం, కొండయ్యగారిపల్లి, చింతమాకులపల్లి అధ్యక్ష కార్యదర్శులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మాదిరాజు లక్ష్మణ రాజు(పతిరాజు),మాదిరాజు ప్రదీప్ రాజు,సింగిల్ విండో చైర్మన్ పగడాల హరిప్రసాద్ రాయల్,ఆవుల రామచంద్రయ్య, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్,పూల చంద్రమౌళి, యువనాయకుడు కార్తీక్,ఆయా పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





